హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించింది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.
ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మార్చి 28న మా సినిమా వస్తుంది. మీరందరూ మనస్ఫూర్తిగా ఆదరించాలని కోరుకుంటున్నాను. మైత్రి మూవీ మేకర్స్ నా హోం బ్యానర్‌లా అయింది. నవీన్ గారికి రవి గారికి ధన్యవాదాలు. మా డైరెక్టర్ వెంకీ కుడుముల గారికి థాంక్యూ. నేను అనుకోకుండా చేసిన సినిమా ఇది. అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా వచ్చింది. ఇది నితిన్ గారికి, నాకు చాలా ఇంపార్టెంట్ మూవీ.” అని తెలిపారు.
ఇంకా తను మాట్లాడుతూ.. “కేతిక అందర్నీ సర్‌ప్రైజ్ చేసింది. డేవిడ్ వార్నర్ గారిని బ్యాటింగ్‌లో చూసాం, కానీ నాకు షూటింగ్‌లో చూసే అవకాశం వచ్చింది. ఇప్పటివరకు వికెట్స్ అని వచ్చారు. ఇప్పుడు టికెట్స్ అని వస్తున్నారు.(నవ్వుతూ). మా సినిమాలో ఆయన పార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాని ఆడియన్స్ అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు.
ఇక ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిన కేతిక శర్మ మాట్లాడుతూ.. “డేవిడ్ వార్నర్ గారితో స్టేజ్‌ని షేర్ చేసుకోవడం డ్రీమ్ ట్రూ మూమెంట్. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నిర్మాతలు రవి గారు, నవీన్ గారికి థాంక్యూ సో మచ్. డైరెక్టర్ వెంకీ గారు చాలా సపోర్ట్ చేశారు. శేఖర్ మాస్టర్ అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. నితిన్ గారి స్క్రీన్ ప్రజెన్స్ మైండ్ బ్లోయింగ్. శ్రీలీల వెరీ బ్యూటిఫుల్ పర్స.న్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: