నేచురల్ స్థార్ నాని నిర్మాణంలో చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ ఎ నోబడీ రేర్ ఫీట్ సాధించింది.ఈసినిమా నిన్నటి తో 50కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.సెకండ్ వీకెండ్ కూడా సూపర్ రన్ కొనసాగించడంతో కేవలం 10 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది.ఐపీఎల్ ప్రభావాన్ని తట్టుకొని మరీ ఈ సినిమా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.ఫుల్ రన్ లో మరో 5 కోట్ల వరకు రాబట్టుకోవచ్చు.అయితే ఈ వారంలో రాబిన్ హుడ్ ,మ్యాడ్ స్క్వేర్ , ఎల్2:ఎంపురాన్ సినిమాలు విడుదలవుతున్నాయి.ఈ మూడు సినిమాలకు సూపర్ బజ్ ఉంది.దాంతో కోర్ట్ కు బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదురుకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా అటు ఓవర్సీస్ లోనూ బ్లాక్ బస్టర్ దిశగా సాగుతుంది.నిన్నటి వరకు అక్కడ 900K డాలర్లను కలెక్ట్ చేసింది.ఈవారంలో వన్ మిలియన్ క్లబ్ లో చేరనుంది. కోర్ట్ కేవలం 9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కడంతో ఊహించని లాభాలను తీసుకొస్తుంది.నాని బ్యానర్ లోనే అత్యధిక కలెక్టన్స్ ను రాబట్టిన సినిమాగా కోర్ట్ రికార్డు సృస్టించింది. మరి నెక్స్ట్ వస్తున్న హిట్ 3 ఈ రికార్డు ను బ్రేక్ చేస్తుందో చూడాలి.
కోర్ట్ ను రామ్ జగదీశ్ డైరెక్ట్ చేయగా ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. శివాజీ, సాయి కుమార్,రోహిణి, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు.విజయ్ బుల్గానిన్ సంగీతం అందించాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: