తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 69వ సినిమా జయ నాయగన్.పక్కా కమర్షియల్ ఎంటర్టైన్ గా తెరకెక్కుతుంది.షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది.మే లోగా బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ మారింది.మూవీ అనౌన్స్ మెంట్ రోజు అక్టోబర్ లో విడుదలచేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ డేట్ మార్చారు.పొంగల్ బరిలోకి దిగనుంది జన నాయగన్.జనవరి 9న ఈసినిమా విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక పొంగల్ కు వస్తే విజయ్ క్రేజ్ తో భారీ వసూళ్లను రాబట్టుకోవడం ఖాయం.అయితే తెలుగులో మాత్రం ఈసినిమాకు భారీ పోటీఎదురుకానుంది.ఎందుకంటే అదే డేట్ కు ఎన్టీఆర్ నీల్ సినిమా విడుదలకానుంది.ఈసినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.మరి తెలుగులో జన నాయగన్ ను అదే రోజున రిలీజ్ చేసే సాహసం చేస్తారా లేక డేట్ మార్చుతారో చూడాలి.
జన నాయగన్ ను ఖాకి ఫేమ్ హెచ్ వినోత్ డైరెక్ట్ చేస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.బాబీ డియోల్,ప్రకాష్ రాజ్,నరైన్,ప్రియమణి,మమితా బైజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.కె వి ఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.
ఇక ఈసినిమా తరువాత విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడు.ఆతరువాత పూర్తిగా పొలిటీషియన్ గా బిజీగా కానున్నాడు.ఇప్పటికే పార్టీ స్థాపించిన విజయ్ వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ బరిలో తన పార్టీని దింపనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: