యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మ్యాడ్ స్క్వేర్ మరో 4 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. టీం నాన్ స్టాప్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు.టీజర్ కి హిలేరియస్ రెస్పాన్స్ వచ్చింది.ట్రైలర్ రేపు రానుంది అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవ్వగా మంచి రెస్పాన్స్ వస్తుంది. అటు యూఎస్ఏ లో 100K డాలర్లను క్రాస్ చేసింది.ఇక ఈసినిమాకు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సాంగ్స్ భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశాడు.ఇందులో మూడు పాటలు ఉండగా అన్ని హిట్ అనిపించుకున్నాయి. మ్యాడ్ కి కూడా తనే మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా విజయంలో సాంగ్స్ కీ రోల్ ప్లే చేశాయి.అయితే మ్యాడ్ స్క్వేర్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం తమన్ తో చేయించారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది.యు/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.రన్ టైం కూడా చాలా తక్కువగా వుంది.కేవలం 2 గంటల 7నిమిషాల నిడివి తో థియేటర్లలోకి రానుంది. ఫస్ట్ పార్ట్ లో నటించిన నార్నె నితిన్,సంగీత్ శోభన్ ,రామ్ నితిన్ ,విష్ణు ఓయ్ ఈ సీక్వెల్ లోనూ లీడ్ రోల్స్ లో నటించగా కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేశాడు.సూర్యదేవర హారిక , సాయి సౌజన్య నిర్మించారు.
హిట్ టాక్ వస్తే మ్యాడ్ స్క్వేర్ ఈజీగా 50 కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.మ్యా డ్ ఫుల్ రన్ లో 16 కోట్ల వసూళ్లను సాధించింది.ఇక మ్యాడ్ స్క్వేర్ పై భారీ అంచనాలు ఉండడంతో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.అయితే ఈసినిమాకు రాబిన్ హుడ్ తో పోటీ ఎదురుకానుంది.నితిన్ నటించిన ఈసినిమా కూడా ఈనెల 28నే రిలీజ్ అవుతుంది.దాంతో బాక్సాఫీస్ వద్ద ఇంట్రెస్టింగ్ క్లాష్ జరుగనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: