ఏపీ ప్రభుత్వానికి TFPC కృతజ్ఞతలు

TFPC Thanks AP Govt Over Support For Industry,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,TFPC Thanks AP Govt,TFPC,TFPC Latest News,TFPC News,AP,AP News,Andra Pradesh,Movie Industry,Film Industry,Tollywood,Tollywood Industry,Telugu Film Industry,TFPC Issues Statement,TFPC Expresses Gratitude To AP,Telugu Film Producers Council Thanks AP Government,TFPC Thanks To AP Government,TFPC Thanks AP Government,AP Government,TFPC Thanks AP,TFPC Thanks Andhra Pradesh Government,Telugu Film Producers Council

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కొత్త విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించినందుకు గానూ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (TFPC) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ మేరకు గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మానవ వనరుల అభివృద్ధి, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, పర్యాటక, సంస్కృతి మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ విషయంలో, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధులు మరియు ప్రముఖ నిర్మాతలు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, మరియు మంత్రి కందుల దుర్గేష్ గారిని కలిసి, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించామని గుర్తుచేసింది.

ఈ సందర్భంగా వైజాగ్, తిరుపతి, రాజమహేంద్రవరంలో స్టూడియోల నిర్మాణం/ మౌలిక సదుపాయాల ఏర్పాటు మరియు నిర్మాతలు, కళాకారులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు గృహనిర్మాణం కోసం భూమి కేటాయింపు వంటి ప్రతిపాదనలను సమర్పించామని, ఏపీలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేగవంతమైన అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి మా పూర్తి సహకారం మరియు మద్దతును అందించామని తెలిపింది.

ఇంకా, నంది అవార్డులను పునరుద్ధరించాలని మరియు పెండింగ్లో ఉన్న అవార్డులనుకూడా ఇవ్వాలని మేము అభ్యర్థించామని కూడా తెలియసింది. కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో త్వరిత చర్య తీసుకోవాలని వినయపూరిత అభ్యర్ధనతో మేము ఎదురుచూస్తున్నామని, దీని ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఏపీలో చలనచిత్ర నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ముందుకు సాగుతుంది, అని పేర్కొంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.