ఓ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా ను స్టార్ట్ చేసి ఏడాదికి కనీసం రెండు సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటాడు మాస్ రాజా రవితేజ.రిజల్ట్ ను పట్టించుకోకుండా వీలైనంత తొందరగా సినిమాలు ఫినిష్ చేస్తాడు ఈహీరో.ప్రస్తుతం రవితేజ మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు.కొత్త దర్శకుడు భాను భోగవరపు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.రవితేజ కు ఇది స్పెషల్ మూవీ కానుంది.తన కెరీర్ లో 75వ సినిమా గా వస్తుంది మాస్ జాతర.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.దాంతో నెక్స్ట్ సినిమా లాక్ చేసుకున్నాడు రవితేజ.నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రవితేజ 76వ సినిమా చేయనున్నాడు.సుధాకర్ చెరుకూరి ఈసినిమాను నిర్మించనున్నారని సమాచారం.త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.ఈసినిమా ఫాస్ట్ గా కంప్లీట్ కానుందట.ప్రస్తుతం హీరోయిన్ ను ఫైనల్ చేసే పనిలో వున్నారు.జూన్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక మాస్ జాతర విజయం రవితేజకు తప్పనిసరి కానుంది.ధమాకా తరువాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు.మాస్ జాతర ఆ రేంజ్ హిట్ ఇస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.మరి ఈసినిమాతోనైనా రవితేజ ఫామ్ లోకి వస్తాడో చూడాలి.శ్రీ లీల ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.మే 9న థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: