పెళ్లి కాని ప్రసాద్.. డిజప్పాయింట్ చేయదు – డైరెక్టర్ మారుతి

Pelli Kani Prasad Doesn't Disappoint Audience, Says Director Maruthi

సప్తగిరి లేటెస్ట్ హోల్సమ్ ఎంటర్‌టైనర్‌ ‘పెళ్లి కాని ప్రసాద్’. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హ్యుమర్, సోషల్ కామెంటరీ బ్లెండ్ తో పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్‌ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించగా.. చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దిల్ రాజు నేతృత్వంలోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా మార్చి 21న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మారుతి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.

ఈ సందర్భంగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. “చిన్న సినిమా సక్సెస్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నాని గారు ప్రొడ్యూస్ చేసిన ‘కోర్ట్’ సినిమా మంచి హిట్ అయి ఆడియన్స్ అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూస్తుంటే చాలా ఆనందం కలిగింది. ఇదే మార్చిలో ఈ రోజుల్లో సినిమా విడుదలైతే జనాలందరూ గొప్పగా ఆదరించారు. మంచి కంటెంట్ ఇస్తే ఎప్పుడూ ఆడియన్స్ సపోర్ట్ ఉంటుందని ప్రూవ్ చేశారు.”

“సప్తగిరి హీరోగా చేస్తుంటాడు. కమెడియన్ గా చేస్తుంటాడు. పెళ్లి కాని ప్రసాద్ కథ చాలా బాగుందని తను బిగినింగ్ నుంచి చెప్తూ వచ్చాడు. ఒకరోజు సినిమా చూపించాడు. సినిమా ఫస్ట్ ఆఫ్ చూసి బాగుంది అని చెప్పాను. సెకండాఫ్ చూసిన తర్వాత ఇంకా బాగా నచ్చింది. పల్లెటూరి వాతావరణం లో ఒక మంచి కథని రైటర్స్ చాలా అద్భుతంగా రాశారు. డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా ట్రెండీగా ఉంది.”

“ఒక మంచి సినిమా చూసామని ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది. అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూసే సినిమా. సినిమాలో కంటెంట్ హీరో అని నమ్మి వెళితే ఈ సమ్మర్ లో ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు. బ్రహ్మానందం గారికి థాంక్యూ. ఆయనతో ఈ వేదికను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చాలా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న దిల్ రాజు గారికి మనస్ఫూర్తిగా థాంక్ యూ” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.