హాస్యనటుడి వృత్తి నిజంగా పవిత్రమైనది – బ్రహ్మానందం

Hasya Brahma Brahmanandam Praises Sapthagiri at Pelli Kani Prasad Pre-Release Event

సప్తగిరి లేటెస్ట్ హోల్సమ్ ఎంటర్‌టైనర్‌ ‘పెళ్లి కాని ప్రసాద్’. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హ్యుమర్, సోషల్ కామెంటరీ బ్లెండ్ తో పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్‌ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించగా.. చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దిల్ రాజు నేతృత్వంలోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా మార్చి 21న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మారుతి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.

ఈ సందర్భంగా హాస్యబ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ.. “అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేడుకకి రావడానికి ప్రధాన కారణం సప్తగిరి. చిరంజీవి గారు మొన్న బ్రహ్మ ఆనందం ఈవెంట్ కి ఇన్విటేషన్ లేకుండానే నేనే వస్తానని వచ్చారు. పెద్దవాళ్ల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం. రీసెంట్ గా ఆ విషయం నేర్చుకున్నాను కాబట్టే ఈ వేడుకకి ఏ ఇన్విటేషన్ లేకుండా వచ్చాను.”

“తమ్ముడు సప్తగిరి సినిమా ఇది. తమ్ముడు కంటే ఒక హాస్య నటుడు సినిమా హిట్ కావాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఇన్విటేషన్ అనేది స్నేహితుల మధ్య జరిగేది, ఆత్మీయుల మధ్య పిలుపులు ఉండవు. ఈ సినిమా కోసం సప్తగిరి చాలా శ్రమ పడ్డాడు. గత 15 రోజులుగా ఏకాకిగా తిరిగాడు. అందరితో కలిసిపోయి తన ప్రతిభని ప్రదర్శించి కనిపించి, కనిపించని అందరి దేవుళ్ళని మొక్కుకున్నాడు.”

“విజయం సాధిస్తే, సినిమాని నమ్ముకుని వచ్చిన నేను హాయిగా నాలుగు మెతుకులు తిని బతుకుతాను అని చెప్పాడు. ఈ మాట మీతో పంచుకోవాలని ఈ వేడుకకు వచ్చాను. ప్రేక్షకుల్ని పదికాలాలపాటు నవ్వించాలనే తపన పడేవాడు హాస్యనటుడు. హాస్యనటుడిది మనల్ని నవ్వించే వృత్తి. నిజంగా ఇది పవిత్రమైనది.”

“నాకు ఈ అవకాశం కల్పించిన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా ట్రైలర్ చూశాను. చాలా నచ్చింది. ఇందులో అన్నపూర్ణమ్మ ఉంది. తనని అప్పా అని పిలుస్తాను. ట్రైలర్లో ఆమెని చూశాక ఒక 40 ఏళ్ల జర్నీ గుర్తుకొచ్చింది. పెళ్ళికాని ప్రసాద్ సినిమాని మంచి హిట్ చేసి మంచి హాస్యనటుడికి మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.