మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లూసిఫర్ 2: ఎంపురాన్’. మరో స్టార్ హీరో కం డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు. మురళి గోపి అందించిన ఈ కథను లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై సుబాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గతంలో వచ్చిన సూపర్ హిట్ ‘లూసిఫర్’కు కొనసాగింపుగా వస్తున్న లూసిఫర్ 2: ఎంపురాన్ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో దీనిని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ అయితే చాలా బావుంది. సినిమాపై అంచనాలను పెంచేదిగావుంది.
కాగా లూసిఫర్ 2: ఎంపురాన్ చిత్రంలో మోహన్ లాల్ ‘ఖురేషి-అబ్రామ్ అలియా స్టీఫెన్ నెడుంపల్లి’ అనే పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఆయనతోపాటు డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, స్టార్ హీరో టోవినో థామస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంకా వరల్డ్ వైడ్‌గా అలరించిన ప్రముఖ వెబ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ మరో ముఖ్య పాత్రలో దర్శనం ఇవ్వనున్నారు.
వీరితోపాటుగా అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్, నైలా ఉష, గిజు జాన్, నందు, శివాజీ గురువాయూర్, ఎస్ మణికుట్టన్, మణికుట్టన్, మణికుట్టన్ ఉన్నారు. ఓ’నెల్, ఎరిక్ ఎబౌనీ, మిఖాయిల్ నోవికోవ్, కార్తికేయ దేవ్ వంటి తదితర నటీనటులు ఇతర పాత్రలను పోషించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: