టాలీవుడ్ గ్రేట్ కమెడియన్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఆయన కొడుకు రాజా గౌతమ్ మరో కీలక పాత్రలో కనిపించాడు. ఫిబ్రవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది. సినిమా బావుందని టాక్ వచ్చినా అందుకు తగ్గ వసూళ్లను మాత్రం రాబట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ‘ఆహా’లో నేటినుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా బ్రహ్మా ఆనందం చిత్రం నేటి యువతరానికి విలువలు నేర్పే ఒక జీవిత పాఠంలాంటి సినిమాగా రూపొందింది. గౌతమ్ మనవడిగా కనిపించగా.. ఆయనకు తాతగా బ్రహ్మి తనదైన నటనతో రక్తి కట్టించారు. స్వార్థపరుడైన కథానాయకుడి అవసరాన్ని తెలుసుకున్న ఓ తాత అతడిని మార్చడానికి చేసే ప్రయత్నమే బ్రహ్మా ఆనందం. కొన్నిరోజుల పాటు తన స్వార్థం పక్కన పెట్టి.. తోటివారి కోసం ఆలోచించాలనే కండీషన్‌తో మనవడిలో తాత మార్పు తీసుకువస్తాడా? లేదా? అనేది కీలకంగా చూపించాడు దర్శకుడు.
RVS నిఖిల్ దర్శకత్వం వహించిన బ్రహ్మా ఆనందంలో ప్రియా వడ్లమాని మరియు ఐశ్వర్య హొలక్కల్ హీరోయిన్లుగా నటించగా. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించారు. శాండిల్య పిసాపాటి మ్యూజిక్ అందించిన ఈ సినిమాను స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: