కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన కామెడీ ఫ్యామిలీ డ్రామా పెళ్లి కాని ప్రసాద్. అభిలాష్ రెడ్డి గోపిడి డైరెక్ట్ చేయగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది.ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.ఈసినిమా మార్చి 21న థియేటర్లలోకి రానుంది.ఈ సందర్భంగా హీరో సప్తగిరి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పెళ్ళికాని ప్రసాద్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది?
సప్తగిరి ఎక్స్ ప్రెస్, సప్తగిరి ఎల్.ఎల్.బి,వజ్ర మకుట దర గోవిందా..ఈ మూడు సినిమాలు కమర్షియల్ జోనర్ లో మెప్పించే చిత్రాలు చేశాను. ప్రజలు 100% ఆదరించారు.ఫన్ జోనర్ లో కామెడీకి మంచి స్కోప్ ఉండే ఒక క్యారెక్టర్ చేయాలనుకున్నాను.అలాంటి సమయంలో పెళ్లి కాని ప్రసాద్ కథ వచ్చింది.స్క్రిప్ట్ విన్నాను చాలా నచ్చింది.డైరెక్టర్ అభిలాష్ ఈ కథ చెప్పినప్పుడు చాలా నవ్వించాడు.అప్పుడే సినిమా డెఫినెట్ గా వర్కౌట్ అవుతుందని నమ్మకం వచ్చింది. చిన్నచిన్న డౌట్స్ ఉంటే మారుతి గారి వద్దకి తీసుకువెళ్లి వినిపించాము. ఆయన విని చాలా బాగుందని చెప్పి ఫస్ట్ కాపీ తో రమ్మని చెప్పారు.ఫస్ట్ కాఫీ తీసుకెళ్లి మారుతి గారి ఇంట్లోనే హోమ్ థియేటర్ లో చూశాం.ఆయన సినిమా చూసి చాలా అప్రిషియేట్ చేశారు.సరైన దారిలో సినిమాని తీసుకెళ్లారని అభినందించారు.అలా మీ ముందుకు వస్తున్నాం.
టైటిల్ సెలక్షన్ ఎవరిది?
డైరెక్టర్ గారిది.వెంకటేష్ గారి కెరీర్ లో ఐకానిక్ క్యారెక్టర్ పెళ్లి కాని ప్రసాద్.ఈ కథకి ఈ టైటిల్ పర్ఫెక్ట్. ఆ టైటిల్ వెయిట్ ని కాపాడేలా ఉంటుంది సినిమా.ఎంటర్టైన్మెంట్ చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది.
ఎస్వీసీ రిలీజ్ గురించి ?
డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నకి థాంక్స్ చెప్తున్నాను. శిరీష్ గారు ఈ సినిమా చూసి మమ్మల్ని అభినందించారు.ఈ సినిమాని ఎస్విసిలో రిలీజ్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. నా కెరియర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా యాక్టర్ గా దిల్ రాజు గారి బ్యానర్ లోనే మొదలైంది.వాళ్ళు కంటెంట్ నచ్చితేనే సినిమాని రిలీజ్ చేస్తారు.మా సినిమా రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది.
డైరెక్టర్ అభిలాష్ గురించి?
అభిలాష్ చాలా క్లారిటీ వున్న డైరెక్టర్. తను స్క్రిప్ట్ చెప్పినప్పుడే 70% డైలాగ్ వెర్షన్ తో చెప్పాడు.ఒక కమెడియన్ ని నవ్వించడం అంత ఈజీ కాదు.కానీ అభిలాష్ ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను.ఆ హ్యూమర్ స్క్రీన్ పైకి వచ్చింది ఖచ్చితంగా ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.
ఈ సినిమాలో మెసేజ్ ఉంటుందా?
లేదండి.ఇది కేవలం ప్రేక్షకులు నవ్వుకోవడానికి చేసిన సినిమా. సినిమాలో స్క్రీన్ ప్లే, సిచ్వేషనల్ కామెడీ చాలా అద్భుతంగా కుదిరింది. సినిమా ఫుల్ ఫన్ రైడ్ లా ఉంటుంది.నిర్మాతలు సినిమాకి చాలా సపోర్ట్ చేశారు.పబ్లిసిటీని చాలా అద్భుతంగా చేశారు. మీడియా సపోర్ట్ కూడా చాలా బాగుంది.సినిమా కంటెంట్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆడియన్స్ సినిమాని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నమ్మకం ఉంది.20న పెయిడ్ ప్రీమియర్స్ ఓపెన్ చేశాం.70% సోల్డ్ అయ్యాయి.అది ఒక చాలా ఆనందాన్ని ఇచ్చింది.
మ్యూజిక్ గురించి ?
శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇచ్చారు. రెండు పాటలు అద్భుతంగా వచ్చాయి. థియేటర్స్ లో చాలా ఎంజాయ్ చేస్తారు.బీజీఎం కూడా ఎక్స్ లెంట్ గా వుంటుంది.
మిమ్మల్ని జూనియర్ పెళ్లికాని ప్రసాద్ అని పిలిచే ఛాన్స్ ఉందా?
అలా జరిగితే చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పటికే కొంతమంది పెళ్లి కాని ప్రసాద్ అని పిలుస్తున్నారు. పబ్లిసిటీ బాగా రీచ్ అయింది.వెంకటేష్ గారు సీన్స్ చూసి కంటెంట్ చాలా పాజిటివ్ గా వుంది హిట్ కొట్టాలని బ్లెస్ చేశారు.
హీరోగా చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి ?
మంచి కథలు వున్నాయి.ఈ సినిమా రిలీజ్ తర్వాత కొత్త సినిమా వివరాలు చెబుతాను.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: