నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కోర్ట్ : ది స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ ఏర్పరచుకున్న ఈ సినిమా మార్చి 14న థియేటర్లలోకి వచ్చింది. ముందురోజే స్పెషల్ ప్రీమియర్స్‌తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ విడుదలయ్యాక యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్‌తో పాటు సూపర్ మౌత్ టాక్‌ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్‌ను రాబట్టుకుంది. తొలిరోజు హోలీ పండుగ కారణంగా హాలిడే కావడం, అలాగే బాక్సాఫీస్ వద్ద మరో సినిమాతో పోటీ లేకపోవడంతో కోర్ట్ సాలిడ్ వసూళ్లను సాధించింది. మొత్తం ప్రీమియర్స్‌తో కలుపుకొని తొలిరోజు 8.10 కోట్లకు పైగా గ్రాస్ అందుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, 6రోజుల్లో మొత్తం 36.85 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది.
‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్‌లో నాలుగో సినిమాగా రూపొందిన కోర్ట్ పోక్సో యాక్ట్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ కోర్ట్ రూమ్ డ్రామాకి రామ్ జగదీశ్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విశిక, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాను ప్రశాంతి తిపిర్నేని ఉన్నత విలువలతో నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: