పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ‘దక్ష’ చిత్రం నుంచి ఆయన ఫస్ట్ లుక్ రివీల్ చేసింది చిత్ర యూనిట్. మంచు ఎంటర్‌టైన్‌మెంట్ మరియు శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మెడికల్-సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో మంచు లక్ష్మీ ప్రసన్న మరో కీలక పాత్రను పోషిస్తోంది. అలాగే రీసెంట్ మలయాళ బ్లాక్ బస్టర్ ‘మార్కో’ మూవీ స్టార్ యాక్టర్ సిద్ధిక్, సముద్రఖని, విశ్వంత్, చిత్రా శుక్లా, మహేష్, వీరేన్ తంబిదొరై తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా దక్ష చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. డైమాండ్ రత్న బాబు కథ అందించిన ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం సమకూరుస్తుండగా.. గోకుల్ భారతి కెమెరా, డ్రాగన్ ప్రకాష్ యాక్షన్ నిర్వహిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: