యంగ్ అండ్ ట్యాలెంటెడ్ యాక్టర్ సప్తగిరి లేటెస్ట్ హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘పెళ్లి కాని ప్రసాద్’. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హ్యుమర్, సోషల్ కామెంటరీ బ్లెండ్ తో పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించగా.. చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దిల్ రాజు నేతృత్వంలోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా మార్చి 21న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మారుతి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సప్తగిరి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. బ్రహ్మానందం గారి మాటలతో నా మనసు బరువెక్కింది. ఇది జీవితంలో మర్చిపోలేని రోజు. గురువుగారికి పాదాభివందనం. మారుతి అన్న నన్ను వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తారు. నా జీవితం మారుతి అన్నతోనే స్టార్ట్ అయింది. ఈ సినిమాకి అండ దండ కొండ లాగా నిలబడటం జీవితంలో మర్చిపోలేను. మమ్మల్ని బ్లెస్స్ చేయడానికి వచ్చిన నిర్మాత ఎస్కేన్ గారికి థాంక్యూ.”
“ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న హర్షిత్ రెడ్డి గారికి థాంక్యూ. ఎస్విసిలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నందుకు వారికి రుణపడి ఉంటాను. దాదాపు ఏడాదిగా ఈ సినిమా కోసం కష్టపడ్డాం. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి చాలా అద్భుతంగా తీశాడు చాలా రోజుల తర్వాత నాకు మంచి కంటెంట్ తో ఉన్న సినిమాని ఇచ్చాడు. అభిలాష్ చాలా మంచి డైరెక్టర్ అవుతాడు. తనకి ఈ సినిమా చాలా కొత్త జీవితాన్ని ఇస్తుంది. మా నిర్మాతలు చాలా ప్యాషన్ తో పని చేశారు.”
“ప్రమోదిని గారు తన క్యారెక్టర్ లో డామినేట్ చేశారు. ఇకపై ఆమెకు వచ్చే క్యారెక్టర్ లో చాలా మార్పులు వస్తాయి. ఈ సినిమా చూసిన వాళ్లంతా కూడా ప్రమోదని గారి యాక్టింగ్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో నాకు మా ఫాదర్ క్యారెక్టర్ చేసిన మురళీధర్ గారికి చాలా మంచి కెమిస్ట్రీ ఉంటుంది. మా ఇద్దరి క్యారెక్టర్స్ మిమ్మల్ని చాలా అలరిస్తాయి. హీరోయిన్ ప్రియాంక శర్మ చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఈ సినిమా తర్వాత తనకి మంచి అవకాశాలు వస్తాయి.”
“సినిమా ఫన్ బ్లాస్ట్ లా ఉంటుంది. మార్చ్ 21న థియేటర్స్ కి వస్తున్నాం. మీ గొప్ప మనసుతో ఆదరించాలని కోరుకుంటున్నాను. 100% థియేటర్స్ లో ఆడియన్స్ ని నవ్విస్తాం. 20 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. కమెడియన్ గా మీ గుండెల్లో నిలిచిపోయే సినిమాలు చేశాను. హీరోగా మంచి సినిమాలు చేశాను. ప్రతిసారి నన్ను నేను నిలబెట్టుకోవడానికి చేసిన యుద్ధంలో ఇండస్ట్రీ, ఆడియన్స్ నాకు అండగా ఉన్నారు.”
“ప్రభాస్ అన్న, వెంకటేష్ గారు, మారుతి అన్న, ఎస్కేన్ గారు దిల్ రాజ్, గారు శిరీష్ గారు, హర్షిత్ అన్న, అనిల్ రావిపూడి అన్న ఇంతమంది గొప్ప వ్యక్తుల బ్లెస్సింగ్స్ మా సినిమాకి దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ వేడుకు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన జగన్ అన్నకే థాంక్ యూ. ఇండస్ట్రీ నుంచి ఈ సినిమా గొప్ప సక్సెస్ అవుతుందనే బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ప్రేక్షక దేవుళ్ళు మా సినిమాని ఆదరించి గొప్ప విజయాన్ని ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుతున్నాను. పెయిడ్ ప్రీమియర్స్ 100% ఫుల్ అవుతున్నాయి. మీ ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తున్నాను” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: