హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ భీమవరంలోని SRKR ఇంజనీరింగ్ కాలేజ్ లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో వేడుకగా జరిగిన ఈవెంట్ లో డైరెక్టర్ వెంకీ కుడుముల తన అనుభవాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా వెంకీ కుడుముల మాట్లాడుతూ.. “మా సినిమా నుంచి వేర్ ఎవర్ యు గో, వన్ మోర్ టైం, అది దా సర్ ప్రైజ్ మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. ఈ మూడు పాటల్లానే ప్రతి కాలేజ్ లో మూడు రకాల స్టూడెంట్స్ వుంటారు. ఒకళ్ళు బాగా చదివి క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో వేర్ ఎవర్ యు గో ఐ ఫాలో అన్నట్లుగా జాబ్స్ కొట్టేస్తారు.” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “రెండో క్యాటగిరీ వన్ మోర్ టైం అంటూ బ్యాక్ లాగ్స్ రాస్తుంటారు. రవి గారు లాగా మూడో క్యాటగిరీ. ఆయన ఇంజనీరింగ్ చదివి ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అయ్యారు. ఏది చేసిన హార్ట్ ఫుల్ గా చేయండి. డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. రాబిన్ హుడ్ కూడా హార్ట్ ఫుల్ గా చేశాం. సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. థాంక్ యూ” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: