30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో అలరించిన హీరో ప్రదీప్ మాచిరాజు తన సెకండ్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ తో వస్తున్నారు. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మేకర్స్ ఈ చిత్రం విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఈ సినిమా వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లో ఒకటిగా ఏప్రిల్ 11న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో సినిమా విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో ప్రదీప్, దీపిక పిల్లిని ఒక రౌడీ గ్యాంగ్ వెంబడిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, సాంగ్స్‌కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి బజ్ నెలకొంది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎన్ బాలరెడ్డి కెమెరా మ్యాన్‌గా, కోదాటి పవన్ కల్యాణ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. సందీప్ బొల్లా కథ, డైలాగ్స్ అందించగా, ఆశిస్తేజ పులాల ప్రొడక్షన్ డిజైనింగ్ నిర్వహిస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి లీడ్ రోల్స్ ప్లే చేస్తుండగా.. వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, జి ఎం సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ, తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా విడుదల తేదీని అనౌన్స్ చేయడంతో, ప్రమోషనల్ యాక్టివిటీస్ జోరు పెంచనున్నారు మేకర్స్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: