కోర్ట్ సినిమా నన్ను గెలిపిచింది

Natural Star Nani Got Emotional on Court - State vs a Nobody Success

నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కోర్ట్’- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రిమియర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో టీం సెలబ్రేషన్ అఫ్ ఆడియన్స్ వెర్డిక్ట్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని సినిమా ఘనవిజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నాని ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “అందరికీ నమస్కారం. నేను ఈ రోజుదాక స్క్రిప్ట్, ప్రేక్షకులు.. ఈ రెండు విషయాలనే నమ్మాను. స్క్రిప్ట్ మా టీంని గెలిచింది. తెలుగు ప్రేక్షకులు సినిమాని గెలిపించారు. కోర్ట్ సినిమా నన్ను గెలిపించింది. ఈ సినిమా విషయంలో, టీం విషయంలో చాలా ప్రౌడ్ గా ఫీలౌతున్నాను. ఈ వీకెండ్ ఒక పండగలా గడిచింది.”

“రానున్న రోజుల్లో కోర్ట్ పేరు మారుమ్రోగుతుంది. సినిమాని ముందుకు తీసుకెలుతున్న అందరికీ పేరుపేరునా థాంక్ యూ. జగదీష్ ని చూసిన వెంటనే నమ్మకం కుదిరింది. నేను మొదటి చూసినప్పుడు ఎలా ఉన్నాడో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి కూడా అంతే సింపుల్ గా వున్నాడు. ఇది గ్రేట్ క్యాలిటీ. ఇప్పటి నుంచే అసలు జర్నీ వుంటుంది. దినేష్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఇచ్చాడు.”

“ఈ కథలో విజువల్ చేసే మ్యాజిక్ ప్రతి ఫ్రేం లో కనిపిస్తుంది. ఆర్ట్ డైరెక్టర్ విట్టల్, ఎడిట్ కార్తిక్, మ్యూజిక్ విజయ్ అందరికీ థాంక్. విజయ్ మ్యూజిక్ ఈ సినిమాకి సూపర్ స్టార్. తన మ్యూజిక్ తో ఎమోషన్ తీసుకొచ్చాడు. నా ప్రొడక్షన్, వాల్ పోస్టర్ సినిమా టీం అందరికీ థాంక్ యూ. ప్రశాంతితో కలసి ఇలాంటి మంచి సినిమాలు చేయడం చాలా ఆనందంగా వుంది.”

“దీప్తి అక్కకి ఈ సినిమాకి సంబధించి అన్ని అప్పగించాను. తను సినిమాని చాలా జాగ్రత్త చూసుకుంది. టీంకి ఒక అక్కలా అయిపొయింది. హర్ష గారు వెర్సటైల్ యాక్టర్. ఈ సినిమాలో పార్ట్ కావడం ఆనందంగా వుంది. రఘు ఈ సినిమాకి బలం. పూర్ణ చారి అమెజింగ్ లిరిక్స్ రాశారు. ప్రేమ పాట సగం ప్రమోషన్స్ చేసింది. రోషన్ శ్రీదేవి బ్యూటీఫుల్ గా పెర్ఫార్మ్ చేశారు.”

“ప్రభావతి గారికి, సుధాకర్ గారికి నేను ఫ్యాన్ ని. రోహిణి గారు మా అమ్మ. ఆమెను చూస్తేనే బోలెడు పాజిటివిటీ వస్తుంది. శివాజీ గారు విజ్రుంభించి చేసిన సినిమాలో నేను పార్ట్ కావడం చాలా ఆనందంగా వుంది. దర్శి తెలుగు సినిమా నసీరుద్దిన్ షా. తనకంటూ ఒక స్టయిల్ వుంది. తనలో గొప్ప సెటిల్ నెస్ వుంటుంది. కంగ్రాట్స్ దర్శి. కోర్ట్ అనే బ్యూటీఫుల్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఈ సెలబ్రేషన్స్ త్రూ అవుట్ ది ఇయర్ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.