రివ్యూ : కోర్ట్

court movie review in telugu

నటీనటులు : ప్రియదర్శి , హర్ష్ రోషన్ ,శ్రీదేవి ,శివాజీ ,సాయి కుమార్
సినిమాటోగ్రఫీ : దినేష్ పురుషోత్తమన్
సంగీతం : విజయ్ బుల్గానిన్
దర్శకత్వం : రామ్ జగదీష్
నిర్మాత : ప్రశాంతి తిపిర్నేని

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నేచురల్ స్టార్ నాని బ్యానర్ లో రూపొందిన నాలుగో సినిమా కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. కోర్ట్ డ్రామాగా రామ్ జగదీష్ తెరకెక్కించిన ఈసినిమాలో హర్ష్ రోషన్ ,శ్రీదేవి లీడ్ రోల్స్ లో నటించగా ప్రియదర్శి ,శివాజీ ,సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు.నాని అయితే ఈసినిమా నచ్చకుంటే నా హిట్ 3 చూడకండి అని స్టేజి మీద అనేశాడంటే కోర్ట్ మీద తనకు వున్న కాన్ఫిడెన్స్ అది.ఇక ఈసినిమా ఈరోజే థియేటర్లలోకి వచ్చింది.మరి నాని నమ్మకం నిజమైందా? ఇంతకీ కోర్ట్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

కథ :
వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరిగే కథ ఇది.చందూ (రోషన్) 19ఏళ్ళ మధ్యతరగతి అబ్బాయి.జాబిలి( శ్రీదేవి) చందూ కన్నా రెండేళ్లు చిన్నా.వీరిద్దరి మధ్య స్నేహం పెరిగి ఆతరువాత ఇద్దరు ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు.జాబిలికి తండ్రి లేడు.మేనమామ మంగపతి( శివాజీ) సంరక్షణలో పెరుగుతుంది.మంగపతి పరువకోసం ప్రాణాలిచ్చే వ్యక్తి .ఒకానొక సమయం లో చందూ , జాబిలి ప్రేమ కథ మంగపతికి తెలుస్తుంది.అక్కడి నుండి తన క్రూరత్వం బయటికి వస్తుంది.తనకు వున్న పలుకుబడి ,డబ్బు తో చందూపై పలు సెక్షన్ లలో కేసులు పెట్టి జైల్లో వేయిస్తాడు.78రోజుల వరకు బెయిల్ రాకుండా చేస్తాడు.చివరికి తుది తీర్పు వెలుబడే తరుణంలో ఈ కేసు జూనియర్ లాయర్ సూర్య (ప్రియదర్శి) టేకప్ చేస్తాడు.ఆ తరువాత ఏమైంది.సూర్య ,చందూను బయటికి తీసుకొచ్చాడా? జాబిలీ ,చందూ ప్రేమకథ చివరికి ఏమైంది అనేది మిగితా కథ.

విశ్లేషణ :

మాములుగా కోర్ట్ డ్రామా లంటే ఎక్కడో ఒక దగ్గర బోర్ అనే ఫీలింగ్ అనిపిస్తాయి.కానీ ఈ కోర్ట్ మాత్రం ఆద్యంతం ఎంగేజింగ్ గా సాగింది. కథలో వెళ్లడానికి పెద్దగా టైం తీసుకోలేదు.చందూ ,జాబిలి లవ్ స్టోరీని చాలా డీసెంట్ గా చూపెట్టారు.ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది.ఇక సెకండ్ హాఫ్ ను కూడా చాలా బాగా డీల్ చేశాడు దర్శకుడు.ముఖ్యంగా అనుభవం వున్న యాక్టర్స్ కావడంతో తమ నటన తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు.

పోక్సో చట్టం అంటే ఏంటో క్లియర్ గా తెలియజేశారు.సినిమా అంతా దీని చుట్టే తిరుగుతుంది. మైనర్ బాలికల పై పై జరిగే అత్యాచారాలను అరికట్టడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.అమాయకులను ఇందులో ఇరికిస్తే ఇలా ఉంటుందో ఈసినిమాలో చూపించారు.డైలాగ్స్ బాగున్నాయి.కొన్ని సీన్లకు ప్రేక్షకుల నుండి విజిల్స్ పడ్డాయి.ఓవరాల్ గా కోర్ట్ నాని నమ్మకం నిజం చేసింది.

నటీనటుల విషయానికి వస్తే లీడ్ రోల్ లో నటించిన హర్ష్ రోషన్ ,శ్రీదేవి చాలా సహజంగా చేశారు.ఇక సినిమాకు హీరో అయ్యింది మాత్రం శివాజీనే.నెగిటివ్ రోల్ లో మంగపతి పాత్రను తన నటన తో నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాడు.తాను స్క్రీన్ మీద కనిపించినపుడల్లా ప్రేక్షకులు కూడా భయపడిపోయారు.అంతలా జీవించేశాడు శివాజీ.ఈసినిమా తో శివాజీ ముందు ముందు చాలా బిజీ కానున్నాడు.ఇక లాయర్ పాత్రలో ప్రియదర్శి అదరగొట్టాడు.తను కూడా ఈసినిమాకు పిల్లర్ లా నిలిచాడు. సినిమాలో ఇంకా చాలా మంది తెలిసిన ఆర్టిస్టులు కనిపించారు.అందరి దగ్గరి నుండి మంచి నటనను రాబట్టుకున్నాడు దర్శకుడు.

టెక్నికల్ గా కూడా ఈసినిమా ఉన్నతంగా వుంది.సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ క్వాలిటీగా వున్నాయి.ఎడిటింగ్ ఓకే.సంగీతం విషయానికి వస్తే వున్న ఒక్క సాంగ్ బాగుంది. బీజీఎమ్ కూడా ఆకట్టుకుంది.నిర్మాణం గురించి చెప్పుకోవాలి.లిమిటెడ్ బడ్జెట్ లో నాని,ప్రశాంతి తిపిర్నేని  మంచి క్వాలిటీతో సినిమాను నిర్మించారు.కథకు ఏది అవసరమో అది సమకూర్చారు.

ఓవరాల్ గా కోర్ట్ రూమ్ లో జరిగే డ్రామాగా వచ్చిన ఈ కోర్ట్ ఎంగేజింగ్ గా ఉండి ఎక్కడా బోర్ కొట్టకుండా సూపర్ అనిపించుకుంది.ఇందులో శివాజీ , ప్రియదర్శి ల నటన ,డైరెక్షన్,సంగీతం హైలైట్ అయ్యాయి.ఫ్యామిలీ తో కలిసి ఈసినిమా థియేటర్లలో తప్పకుండా అందరూ చూసేలా వుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.