రీసెంట్ గా తెలుగులో విడుదలైన హిందీ మూవీ ఛావా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటూ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతుంది.5 రోజుల్లో ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో 11.91 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.అంతేకాదు ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకొని లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఫుల్ రన్ లో ఈసినిమా 15కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.తెలుగులో ఈసినిమాను గీతా ఆర్ట్స్ రిలీజ్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అటు హిందీలో ఇప్పటికీ స్లో అవ్వకుండా సూపర్ వసూళ్లను సొంతం చేసుకుంటుంది.నిన్నటి తో హిందీ వెర్షన్ దేశ వ్యాప్తంగా 540 కోట్ల నెట్ ను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 750 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.అలాగే ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా ఛావా రికార్డు సృష్టించింది.
ఫుల్ రన్ లో స్త్రీ 2 కలెక్షన్స్ ను క్రాస్ చేయనుంది.
లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ లో మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈసినిమాలో విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్ గా, రష్మిక మందన్న యేసుబాయి భోంస్లేగా, అక్షయ్ ఖన్నా ఔరంగజేబుగా, డయానా పెంటీ జినత్-ఉన్-నిస్సా బేగంగా, అశుతోష్ రాణా హంబిర్రావ్ మోహితేగా, దివ్య దత్తా సోయారాబాయిగా నటించారు.ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా దినేష్ విజన్ ఈసినిమాను నిర్మించాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: