హీరో నితిన్ ప్రధానపాత్రలో నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ ‘రాబిన్‌హుడ్’. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ.. “మార్చి 28న రాబిన్‌హుడ్ వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన మూడు పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. నిన్న వచ్చిన అది దా సర్ప్రైజ్ పాట కూడా చాలా పెద్ద హిట్ అయింది. దిల్ రాజు గారి వల్ల ఆ వర్డ్ పాపులర్ అయింది కాబట్టి ఆయనకి థాంక్స్ చెప్తున్నాను. జీవి ప్రకాష్ చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు.”
“డైరెక్టర్ వెంకీ, నేను నిన్న రాత్రి సినిమా చూసుకున్నాం. ఈ సినిమా మా కెరీర్ హ్యుజ్ మూవీ కాబోతుందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలను. నా బర్త్ డే మార్చ్ 30. ఈ సినిమా వచ్చేది మార్చి 28. డైరెక్టర్ వెంకీ ఈ సినిమాతో నాకు బిగ్గెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ‘భీష్మ’కి డబల్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుంది.”
“నేను, శ్రీలీల, రాజేంద్రప్రసాద్ గారు, వెన్నెల కిషోర్ మా సీన్స్ చాలా ఎక్స్ట్రార్డినరీగా వచ్చాయి. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు. చాలా క్లీన్ కామెడీ ఉంటుంది. ఎక్కడ అసభ్యకరమైన మాట ఉండదు. ఇంత ఆర్గానిక్ కామెడీ ఈ మధ్యకాలంలో నేనెక్కడ చూడలేదు. ఇంత మంచి స్క్రిప్ట్ రాసిన డైరెక్టర్ వెంకీకి థాంక్యూ. మార్చి 28న వెంకీ కుడుముల విశ్వరూపం చూడబోతున్నారు. వెంకీకి ఇది 3.o.”
“కథ ఎమోషన్ స్క్రీన్ ప్లే అత్యద్భుతంగా రాశాడు. క్లైమాక్స్ చూసిన తర్వాత ఆడియన్స్ వావ్ అంటారు. నాకు శ్రీలీలకు ఈ కనిమ ఒక హిట్ కపుల్ లా నిలబడుతుందనే కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మైత్రి మేకర్స్ లేకపోతే ఈ సినిమా ఇంత క్వాలిటీ గా వచ్చేది కాదు.మైత్రీ మూవీ మేకర్ కి థాంక్యూ వెరీ మచ్ మైత్రి మూవీ మేకర్స్ ఇండియాలో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. ఈ సినిమాతో మరో సక్సెస్ చూడబోతున్నారు. మార్చి 28 థియేటర్స్ లో కలుద్దాం.” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























