హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఇక ఈ సందర్భంగా చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “మైత్రి మూవీస్ లో ఇంతకుముందు శ్రీమంతుడు, వాల్తేరు వీరయ్య సినిమాలు చేశాను. రాబిన్ హుడ్ సినిమాలో నటించిన తర్వాత మళ్లీ నాకు నా పాత రోజులు గుర్తొచ్చాయి నేను హీరోగా చేసిన సినిమాలన్నీ గుర్తుకొచ్చాయి.” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “వెంకీ కుడుముల ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. ఎంటర్టైన్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ లో ఇచ్చాడు. ఇంత క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. నితిన్ కి ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఒక అద్భుతమైన కథతో ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసిన సినిమా ఇది. తప్పకుండా ఈ సినిమా ఆడియన్స్ ని అద్భుతంగా అలరిస్తుంది” అని అన్నారు.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: