టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ‘చిరు’ కానుక అందుకుంది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతే దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ ఇందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసింది శ్రీలీల. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ ఏడెకరాల్లో జరుగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇదే స్టూడియోలో నటి శ్రీలీల మరో షూటింగ్‌లో పాల్గొంటోంది. ఈ క్రమంలో పక్క సెట్‌లో మెగాస్టార్ ఉన్నారని తెలియడంతో వెంటనే ఆమె విశ్వంభర సెట్‌లోకి అడుగుపెట్టింది. చిరంజీవిని చూసిన వెంటనే గౌరవభావంతో పాద నమస్కారం చేసింది. ఈ సందర్భంగా మెగాస్టార్ శ్రీలీలకు శాలువా కప్పి సత్కరించారు.
అలాగే దుర్గాదేవి రూపం ముద్రించిన ఓ శంఖాన్ని కూడా ఆమెకు బహూకరించారు. ఇక మెగాస్టార్ నుంచి ప్రత్యేకమైన బహుమతిని అందుకున్న శ్రీలీల ఆనందం వ్యక్తం చేసింది. అనంతరం ఆయనతో కలిసి ఫోటోలు దిగింది. ఆపై వీటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. కాగా ఇదంతా జరిగింది మార్చి 8న (మహిళా దినోత్సవం) కావడం గమనార్హం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: