రజనీకాంత్ జైలర్ 2 షూటింగ్ షురూ

Super Star Rajinikanth's Jailer 2 Shoot Begins Today

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా రెండేళ్ల క్రితం వచ్చిన ‘జైలర్’ సినిమా గుర్తుండేవుంటుంది. దీనికిముందు అంతగా హిట్స్ లేని ఆయన ఈ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.600కోట్లకు పైనే వసూళ్లను రాబట్టి పలు రికార్డులు బద్దలుకొట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగులో కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. దాదాపు రూ.80కోట్ల వరకూ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు నెల్సన్ దీలిప్ కుమార్ దర్శకత్వం వహించగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్.

దీనికి సంబంధించి ఇప్పటికే అనౌన్స్‌మెంట్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో నెల్సన్, అనిరుధ్ తెలుగులో డబ్బింగ్ చెప్పడం హైలైట్. ఫస్ట్ పార్ట్ ని మించి జైలర్ 2 ఉండబోతుందని ఈ టీజర్ ద్వారా హింట్ ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా ‘జైలర్ 2’ షూటింగ్ షురూ అయింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది చిత్ర యూనిట్. కాగా సూపర్ హిట్ కాంబో మరోసారి రిపీట్ కానుండటంతో ఈ సినిమాపై ఇప్పటినుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఇదిలావుంటే, మరోవైపు రజినీకాంత్ ప్రస్తుతం ‘కూలీ’ చిత్రంలో నటిస్తున్నాడు. క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.