ఛత్రపతి శంభాజీ మహారాజ్ అజేయమైన స్ఫూర్తిని, ధైర్యాన్ని సెలబ్రేట్ చేసుకునే ఎపిక్ బ్లాక్ బస్టర్ ‘ఛావా’. దినేష్ విజన్ మాడ్డాక్ ఫిల్మ్స్ నిర్మించి, లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన చావాలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించారు. హిందీ వెర్షన్ భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన తర్వాత ఈ పవర్ ఫుల్ కథను గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ మార్చి 7న తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ తరుణంలో మేకర్స్ థాంక్ యూ మీట్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ సినిమాని తెలుగులో ఇంత గర్వంగా రిలీజ్ చేయగలిగాను అంటే దానికి కారణం దినేష్ గారు. ఆయన మమ్మల్ని బలంగా నమ్మి ఇచ్చారు. సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడైనా హిట్ చేస్తారు. అదే నమ్మకంతో ఆయన సినిమా ఇచ్చారు.”
“దినేష్ గారికి, మాడ్ డాక్ ఫిల్మ్స్ టీం అందరికీ థాంక్ యు. సినిమాలో వినీత్ గారి క్యారెక్టర్ కి చాలా కనెక్ట్ అయ్యాను. క్లైమాక్స్ లో కన్నీళ్ళు వచ్చాయి. ఒక చరిత్రని సినిమాగా తీయడం అంత ఈజీ కాదు. అలాంటి ఒక కొత్త చరిత్రని ఇంత గొప్ప సినిమాగా ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛని స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నామంటే కారణం ఆ రోజు శంభాజీ మహారాజ్ లాంటి మహావీరులు త్యాగమే ఫలితమే.”
“ఒక మంచి సినిమాని తెలుగులోకి తీసుకురావాలనే తపనతో ఈ సినిమా చేశాం. మా టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసింది. ఇది మంచి సినిమా. పిల్లలకు చూపించాల్సిన సినిమా. ఈ జనరేషన్ లో ఫ్రీడమ్ వాల్యూ తెలియాలంటే తల్లిదండ్రులు ఇలాంటి సినిమాలను పిల్లలు చూపించాలని కోరుకుంటున్నాను.”
“ఛావా కేవలం సినిమా మాత్రమే కాదు.. గ్రేట్ ఎమోషన్. రెహ్మాన్ గారికి థాంక్. నాలుగు రోజుల్లో ఆయన పాటలని పూర్తి చేశారు. ఆయన ఎంత బిజీగా ఉంటారో మనకి తెలుసు. సినిమాపై ప్రేమతో మాకు చేసిచ్చారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరు ధన్యవాదాలు. సినిమాకి అద్భుతమైన స్పందన వస్తుంది. తప్పకుండా ఈ సినిమా మీ పిల్లలని తీసుకెళ్ళండి. గొప్ప ఎమోషన్ తో బయటికి వస్తారు” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: