‘నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ ♀ శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తన మనసులోని భావాలను పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా ఆయన తనతో పనిచేసిన పలువురు హీరోయిన్స్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. వీరిలో సీనియర్ నటీమణులు కుష్బూ, నదియా, రాధిక, సుహాసిని, మీనా, జయసుధ తదితరులు ఉన్నారు. అలాగే ఈ చిత్రంలో చిరు సతీమణి సురేఖ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక చిరు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: