గతేడాది ‘హరోం హర, మా నాన్న సూపర్ హీరో’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన టాలీవుడ్ ట్యాలెంటెడ్ యాక్టర్ ‘నవ దళపతి’ సుధీర్ బాబు తాజాగా హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘జటాధర’. నూతన దర్శకుడు వెంకట్ కల్యాణ్ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ బైలింగ్యువల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో నేడు మహిళా దినోత్సవం సందర్భంగా జటాధర టీమ్ బాలీవుడ్ హీరోయిన్‌కి స్వాగతం పలికింది. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రముఖ నటి సోనాక్షి సిన్హాకు స్వాగతం పలుకుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేదిగావుంది.
ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌లో యాక్షన్, మిస్టరీతో కూడిన పవర్ ఫుల్ అవతార్‌లో సోనాక్షి కనిపించనున్నారు. ‘హీరామండి’లో ఆమె పవర్ ఫుల్ పాత్ర తర్వాత, సోనాక్షి పౌరాణికాలు, యాక్షన్, అతీంద్రియ అంశాలను బ్లెండ్ చేసే పాన్-ఇండియా చిత్రం జటాధారతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది.
సోనాక్షి సిన్హా మార్చి 10న షూట్ లో జాయిన్ అవుతారు. అద్భుతమైన కథాంశం, విజువల్స్‌తో ‘జటాధార’ ఈ సంవత్సరంలో మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తోంది. ఇది మునుపెన్నడూ లేని విధంగా గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది. ఇక జటాధార ప్రయాణం ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ ముహూర్త వేడుకతో ప్రారంభమైంది.
దీనికి పరిశ్రమలోని ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు, టీం మౌంట్ అబూ అడవుల్లోకి వెళుతోంది. అక్కడ మౌకా స్టూడియోస్‌లో సినిమా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని జీవం పోయడానికి ఒక అద్భుతమైన అడవి సెట్ నిర్మించింది. ఈ చిత్రం స్కేల్, ఎపిక్ జర్నీ హై-ఆక్టేన్ యాక్షన్‌లో విజువల్ అద్భుతమైన అనుభవాన్ని హామీ ఇస్తుంది.
ఇక ఈ క్రేజీ ప్రాజెక్టులో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ జీ స్టూడియోస్ భాగస్వామ్యం కానుంది. శివన్ నారంగ్, ప్రేర్నా అరోరా, నిఖిల్ నందా, ఉజ్వల్ ఆనంద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్షయ్ కేజ్రీవాల్, కుస్సుమ్ అరోరా సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే క్రియేటివ్ ప్రొడ్యూసర్స్‌గా దివ్య విజయ్, సాగర్ ఆంబ్రే కూడా ఈ చిత్రానికి కొలబరేట్ అయ్యారు. ఇక ఈ సినిమాలో నటించనున్న ఇతర నటీనటులు, పనిచేయనున్న సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: