కోర్ట్ ట్రైలర్‌ రిలీజ్

Court - State Vs A Nobody Trailer Released

నేచురల్ స్టార్ నాని నిర్మాణ సారథ్యంలోని వాల్ పోస్టర్ సినిమా సమర్పిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. యంగ్ హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా విడుదల కానుంది. దీంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌పై దృష్టి సారించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘ప్రేమలో’ ఫస్ట్ లవ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

చట్టపరమైన ఆరోపణలలో చిక్కుకున్న ఒక యువకుడు దానినుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాన్ని ఆసక్తిగా చూపించారు. అతడికి న్యాయం చేసేందుకు సిద్దమైన లాయర్ పాత్రలో ప్రియదర్శి కనిపించాడు. సత్యం కోసం చేసే పోరాటంతో, బలమైన కథాంశంతో, ఈ చిత్రం ఆలోచింపజేసేదిగా ఉంటుందని అర్ధమవుతోంది. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.

హీరో నాని ఇంతకుముందు అనౌన్స్ చేసినట్టుగానే ఈ చిత్రం ఆయన బ్యానర్ స్థాయిని పెంచేదిగా ఉండనుందని తెలుస్తోంది. కాగా పోక్సో చట్టం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విశిక, వడ్లమణి శ్రీనివాస్ వంటి ఇతర ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తోంది.

ఇక విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విఠల్ కోసనం ఆర్ట్ డైరెక్టర్ కాగా, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. అలాగే స్క్రీన్‌ప్లేను కార్తికేయ శ్రీనివాస్, వంశీధర్ సిరిగిరి రాశారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.