జాక్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

Jack First Single Pablo Neruda Released

డీజే టిల్లు ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టిస్తోన్న మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ ‘జాక్ – కొంచెం క్రాక్‌’. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కల‌యిక‌లో స‌రికొత్త జోన‌ర్‌లో ‘జాక్- కొంచెం క్రాక్‌’ మూవీ రూపొందుతోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏప్రిల్ 10న ఈ మూవీ గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన జాక్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ తాజాగా జాక్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఇక ఈ పాటకు వనమాలి సాహిత్యం అందించగా.. గాయకుడు బెన్నీ దయాల్ ఆలపించారు. కంపోజర్ అచ్చు రాజ‌మ‌ణి అద్భుతమైన సౌండ్ ట్రాక్‌ అందించాడు.

మొత్తానికి క్రాక్‌ గాడుగా క‌నిపించే జాక్ పాత్ర‌లో సిద్ధుజొన్న‌ల‌గ‌డ్డ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్‌, నరేష్‌, బ్ర‌హ్మాజీ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బివిఎస్ఎన్ ప్ర‌సాద్ ‘జాక్- కొంచెం క్రాక్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.