తండేల్.. ఇప్పటివరకూ ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Thandel Collects Over Rs115 Cr Gross Worldwide

యువ సామ్రాట్ నాగ చైతన్య లేటెస్ట్ సెన్సేషన్ ‘తండేల్’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. 100 కోట్ల క్లబ్‌లోకి ఎంటరైన అతని మొదటి చిత్రంగా నిలిచింది. చందూ మొండేటి దర్శకత్వం వహించగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. తద్వారా తండేల్ నాగ చైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫిబ్రవరిలో ఆఫ్-సీజన్ విడుదలైనప్పటికీ, ఆదివారాలు తప్ప, పెద్ద సెలవులు లేనప్పటికీ, ఈ చిత్రం ఫుట్ ఫాల్స్ అద్భుతంగా వున్నాయి. అయితే ఈ చిత్రం HD వెర్షన్ విడుదలైన మొదటి రోజే లీక్ అయినప్పుడు పైరసీ ఆందోళనలు పెద్ద ఎత్తున తలెత్తాయి. అయితే అలాంటి అవాంతరాలని కూడా దాటుకొని వందకోట్ల క్లబ్‌లో చేరడం మామూలు విషయం కాదు.

ఈ క్రమంలో సెకండ్ వీక్ ముగియకముందే, ఓవర్సిసీస్ ఎర్నింగ్‌లో $1 మిలియన్ మార్క్ అందుకుని మరో బిగ్ మైల్ స్టోన్‌ని దాటింది. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 115 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అందుకుంది. ఇదిలావుంటే, తండేల్ నేటినుంచి ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం అన్ని ప్రధాన భాషల్లో అందుబాటులో ఉంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో నిర్మాత బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం డొమస్టిక్ మార్కెట్లో అద్భుతంగా రాణించడమే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ లాభదాయకమైన వెంచర్‌ అయ్యింది. వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో నాగచైతన్య తొలిసారిగా ఫిషర్ మ్యాన్ క్యారక్టర్ పోషించడం, ఆయనకు జోడిగా సౌత్ బ్యూటీ సాయిపల్లవి నటించడం, అందమైన ప్రేమకథను హృద్యంగా ఆవిష్కరించిన దర్శకుడి ప్రతిభ.. వెరసి సినిమా బ్లాక్ బస్టర్ అయింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.