ప్రముఖ దక్షిణాది నటి, స్టార్ హీరోయిన్ నయనతార అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేసింది. ఈ మేరకు ఆమె తాజాగా సోషల్ మీడియా వేదికగా బహిరంగ లేఖ విడుదల చేసింది. ఈ సందర్భంగా నయనతార తన ఫ్యాన్స్‌ని ఉద్దేశించి ఒక విజ్ఞప్తి చేశారు. ఇకపై తనను ‘లేడి సూపర్ స్టార్’ అని సంభోదించవద్దని కోరారు. అభిమానులతో అలా పిలిపించుకోవడం తనకు ఇష్టమే అయినా కూడా ఇప్పటినుంచి మాత్రం వద్దని స్పష్టం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా నయనతారని లేడి సూపర్ స్టార్ అనే ట్యాగ్ తో పిలుస్తారన్న విషయం తెలిసిందే. ఇటు ఆమె ఫ్యాన్స్ కానీ, మీడియాలో కానీ నయనను అదే పేరుతో వ్యవహరిస్తుంటారు. అయితే ఇంతకుముందు టాలీవుడ్ సీనియర్ నటి విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునేవారు. కానీ, సినిమా తారలను ఇలా రకరకాల బిరుదులతో పిలవడం అనేది చాలా సర్వసాధారణం.
మన తెలుగు హీరోలలో చిరంజీవిని ‘మెగాస్టార్’, బాలయ్యని ‘గాడ్ ఆఫ్ మాసెస్’, పవన్ కళ్యాణ్‌ని ‘పవర్ స్టార్’ ప్రభాస్‌ని ‘పాన్ ఇండియా రెబెల్ స్టార్ లేదా డార్లింగ్’ అనే పేర్లతో సంబోధించడం తెలిసిందే. అలాగే కోలీవుడ్‌లో రజినీకాంత్‌ని ‘సూపర్ స్టార్’, కమల్ హాసన్‌ని ‘లోకనాయకుడు’ విజయ్‌ని ‘దళపతి’, అజిత్‌ని ‘థలా’ అని పిలుస్తుంటారు. అయితే ఎక్కువగా హీరోలకు మాత్రమే ఇలా ప్రత్యేక బిరుదులు ఉంటుంటాయి.
కానీ, చాలా అరుదుగా మాత్రమే కథానాయికలకు కూడా స్పెషల్ ట్యాగ్స్ ఉంటాయి. ఇదేకోవకు చెందినదే హీరోయిన్ నయనతార. ఆమె నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అవ్వడం, దాదాపు దక్షిణాదిన అందరు అగ్రహీరోలతో నటించడంతో నాయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అలాగే ఆమె పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించి మెప్పించడంతో అభిమానులు సహా మీడియా కూడా లేడీ సూపర్ స్టార్ అని పిలవడం ప్రారంభించారు.
ఈ నేపథ్యంలోనే నయనతార దీని గురించి స్పందించడం, ఇకపై తనను లేడీ సూపర్ స్టార్ అని పిలవొద్దని కోరుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ఇటు చిత్ర పరిశ్రమతోపాటు అటు అభిమానులనూ ఆశ్చర్యానికి గురిచేసింది. అందులో.. “తనను ఆదరించిన అందరికీ ధన్యవాదాలని, తన జీవితం ఒక పుస్తకం లాంటిదని, ఆమె సక్సెస్‌లో అందరి పాత్ర ఉందని, ఇన్నాళ్ళూ తనను ఆదరించినందుకు థాంక్స్ అని, మరియు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు అది చాలు నాకు” అని నయన్ పేర్కొంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: