మ్యాడ్ ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా 8 వసంతాలు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా కాన్సెప్ట్-సెంట్రిక్ మూవీ గా ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే రిలీజైన ఫస్ట్ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ అందమా అందమాను విడుదల చేసి మ్యూజిక్ జర్నీ ప్రారంభించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఖుషి ,హాయ్ నాన్న మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈసాంగ్ ఒక యువకుడి మనసుని దోచుకున్న అమ్మాయి పట్ల అతని అనురాగాన్ని ప్రజెంట్ చేస్తోంది.విన్న వెంటనే కనెక్ట్ అయ్యే ఈ పాట ఆడియన్స్ ని కట్టిపడేసింది.
మెలోడిక్ అకౌస్టిక్ గిటార్ సోల్ ఫుల్ టచ్ తీసుకొచ్చింది.ప్రతి వాయిద్యం లవ్ ఎమోషన్ డెప్త్ ప్రజెంట్ చేస్తోంది. వనమాలి రాసిన సాహిత్యం కవితాత్మకంగా వుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్,ఆవాని మల్హర్‌తో కలసి మెస్మరైజింగ్ గా ఈ పాటని ఆలపించారు. హను రెడ్డి, అనంతిక బ్యుటీఫుల్ కెమిస్ట్రీ షేర్ చేసుకున్నారు.విజువల్స్ పాటలానే ఆకట్టుకున్నాయి.
ఈసినిమాలో హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.త్వరలో సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: