ఎప్పటినుండో ఎదురుచూసిన విజయం ఎట్టకేలకు నాగ చైతన్యకు తండేల్ తో దక్కింది.ఫ్రిబ్రవరి 7న విడుదలైన ఈసినిమా 100కోట్ల వసూళ్లతో చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈసినిమా తో అక్కినేని హీరోల్లో మొదటి సారి 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు చైతన్య.సినిమాలకు ఫ్రిబవరి నెల సరైన సమయం కాకపోయినా ఈసినిమా సూపర్ వసూళ్లను రాబట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తండేల్ ఓటిటి లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది.నెట్ ఫ్లిక్స్ అన్ని భాషలకును ఈసినిమా హక్కులను తీసుకుంది.దాంతో ఈనెల 7న అన్ని భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.వాస్తవిక సంఘటనల ఆధారంగా చందు మొండేటి తెరకెక్కించిన ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.నాగ చైతన్య ,సాయి పల్లవి ల నటన , దేవి సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.గీతా ఆర్ట్స్ ఈసినిమాను నిర్మించింది.
ఇక ఈసినిమా తరువాత నాగ చైతన్య నెక్స్ట్ మూవీని విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు డైరెక్షన్ లో చేయనున్నాడు.100కోట్లకు పైగా బడ్జెట్ తో మైత్రికల్ థ్రిల్లర్ గా రానుంది. ఈ సమ్మర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది.మీనాక్షి చౌదరి ని హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించనుండగా ఎస్విసిసి బ్యానర్ లో సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈసినిమాను నిర్మించనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: