ఈఏడాది సంక్రాంతికి వచ్చి ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా రికార్డు సృష్టించింది సంక్రాంతికి వస్తున్నాం.ఈసినిమా థియేటర్లలో ఏకంగా 300 కోట్ల కు పైగా వసూళ్లతో రీజినల్ మూవీస్ లో ఆల్ టైం రికార్డు సృష్టించింది.ఎక్స్టార్డినరీ రన్ తో బయ్యర్లకు ఊహించని లాభాలు తీసుకొచ్చింది. ఇక ఈసినిమా రెండు రోజుల క్రితం ఒకే సమయానికి టీవీ ,ఓటిటి లోకి వచ్చింది.జీ 5 డిజిటల్ హక్కులను దక్కించుకోగా జీ తెలుగు శాటిలైట్ రైట్స్ తీసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అన్నిభాషల్లో ఓటిటిలోకి వచ్చిన ఈసినిమా ఈసినిమా సెన్సేషనల్ వ్యూస్ ను రాబట్టుకుంది.కేవలం 12 గంటల్లోనే 100 మిలియన్ల వ్యూస్ తో అతి తక్కువ సమయంలో ఈ ఫీట్ సాధించిన సినిమాగా ఆల్ టైం రికార్డు సృష్టించింది.ఇంతకుముందు ఈ రికార్డు ఆర్ఆర్ఆర్ ,హనుమాన్ పేరిట ఉండేది.మొత్తానికి థియేటర్లలో అదరగొట్టిన ఈసినిమా డిజిటల్ లో కూడా దుమ్ము రేపుతోంది.
ఈసినిమాతో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మొదటి సారి 300కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.అంతేకాదు సీనియర్ హీరోల్లో ఈ ఫీట్ సాధించిన మొదటి హీరోగా కూడా రికార్డు సృష్టించాడు.
అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాలో ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.దిల్ రాజు ,శిరీష్ ఈసినిమాను నిర్మించారు. ఈసినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: