యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వచ్చే నెలలో దిల్ రుబా తో రానున్నాడు.క కన్నా ముందే ఈసినిమా షూటింగ్ పూర్తి కాగా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు.విశ్వ కరుణ్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈసినిమా నుండి ఇంతకుముందు వచ్చిన రెండు పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా ఈరోజు మూడో పాటను రిలీజ్ చేశారు. కన్నా నీ అంటూ ఈ సాగే ఈ సాంగ్ కూడా బాగుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లవ్ &యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో రుక్షార్ దిల్లాన్ ,కాథీ డేవిసన్ హీరోయిన్లుగా నటించగా సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.సరిగమ సినిమాస్ తో కలిసి రవి ,రాకేష్ రెడ్డి నిర్మించారు.మార్చి 14న దిల్ రుబా థియేటర్లలోకి రానుంది.
ఇక కిరణ్ అబ్బవరం గత ఏడాది దీపావళికి క తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.ఈసినిమాతో తను 50కోట్ల క్లబ్ లో చేరాడు.ఈసినిమా వరుస పరాజయాలకు బ్రేక్ వేసి కిరణ్ కు కావాల్సిన విజయాన్ని అందించింది.మరి దిల్ రుబా తో కిరణ్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడో చూడాలి.
ప్రస్తుతం కిరణ్ అబ్బవరం కె -ర్యాంప్ అనే సినిమా చేస్తున్నాడు.నూతన దర్శకుడు నాని ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా యుక్తి థరేజా హీరోయిన్ గా నటిస్తుంది.చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.సామజవరగమన నిర్మాత రాకేష్ దండా ఈసినిమాను నిర్మిస్తున్నారు.ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: