బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తమ అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించారు. త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు కియారా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఇందుకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫొటోను పంచుకున్నారు. ఈ ఫొటోలో కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తమ రెండు చేతులు ముందుకు చాచి పసిబిడ్డ ధరించే తెలుపు రంగు సాక్స్‌లను పట్టుకుని ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సందర్భంగా ఆమె, త్వరలో తమ జీవితాల్లోకి గొప్ప గిఫ్ట్ రాబోతున్నట్టు అందులో పేర్కొన్నారు. అయితే ఈ విషయం తెలిసిన ఈ జంట అభిమానులు, సినీ సెలబ్రిటీలు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలావుంటే, 2023 ఫిబ్రవరిలో కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం జైపూర్‌లోని ఓ ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. కాగా ఇంతకుముందు కూడా కియారా గర్భవతి అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అప్పుడు వాటిని ఖండించినా.. ఇప్పుడు మాత్రం ఆమే స్వయంగా ప్రకటించడం విశేషం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: