టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా వున్న హీరోల్లో శ్రీ విష్ణు ఒకరు.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు చేస్తున్నాడు ఈహీరో. ఈరోజు శ్రీ విష్ణు బర్త్ డే కావడంతో రెండు సినిమాల నుండి అప్డేట్స్ రాగ రెండు సినిమాలను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.అందులో సింగిల్ ఒకటి. గీతా ఆర్ట్స్ నిర్మిస్తుంది.శ్రీ విష్ణు కంఫర్ట్ జోన్ లో వస్తున్న సినిమా ఇది.రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేశారు.ఈరోజు స్పెషల్ వీడియో ను రిలీజ్ చేసి విషెస్ తెలిపింది సింగిల్ టీం. ఈసినిమాలో కేతికా శర్మ ,ఇవానా హీరోయిన్లు గా నటిస్తుండగా కార్తీక్ రాజు డైరెక్ట్ చేస్తున్నాడు.విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాతోపాటు శ్రీ విష్ణు, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ బ్యానర్ లో వస్తున్న మొదటి సినిమా ఇదే.షూటింగ్ జరుగుతుంది.జానకి రామ్ మారెళ్ల డైరెక్ట్ చేస్తుండగా బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు.త్వరలోనే మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు.
ఇక ఈసినిమాలతో పాటు శ్రీ విష్ణు, ఎస్ఎస్ సి బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రానుంది.మారుతీ రావు తెరకెక్కిస్తుండగా సుమంత్ నాయుడు నిర్మిస్తున్నారు.
ఇవి కాకుండా శ్రీ విషు,మృత్యంజయ్ అనే సినిమా కూడా చేస్తున్నాడు.టైటిల్ టీజర్ ను ఈరోజు రిలీజ్ చేశారు.సామజవరగమన తరువాత శ్రీ విష్ణు ,రెబ్బా మోనికా జాన్ జంటగా నటిస్తున్నారు.హుస్సేన్ షా కిరణ్ డైరెక్ట్ చేస్తుండగా కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.లైట్ బాక్స్ మీడియా నిర్మిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: