ది ప్యారడైజ్ గ్లింప్స్ 8 భాషల్లో

The Paradise glimpse will be released in 8 languages

దసరా తరువాత నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రానున్న సినిమా ది ప్యారడైజ్.దసరాకు మించిన యాక్షన్ తో తెరకెక్కనుంది.ఇక ఈసినిమా నుండి వచ్చే నెల 3న రా స్టేట్మెంట్ పేరుతో గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు.ఈ గ్లింప్స్ వైల్డ్ అండ్ బోల్డ్ గా రానుంది.దాంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అంతేకాదు ఈ గ్లింప్స్ ను గ్లోబల్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు.దక్షిణాది భాషలతో పాటు హిందీ ,బెంగాలీ ,ఇంగ్లీష్ ,స్పానిష్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. హీరోయిన్ ను ఫైనల్ చేయాల్సి వుంది.ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.

ఇక ప్రస్తుతం నాని, హిట్ 3 చేస్తున్నాడు.రీసెంట్ గా ఈసినిమా నుండి టీజర్ రిలీజ్ కాగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది. శైలేష్ కొలను ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.మే 1న హిట్ 3ని థియేటర్లలోకి తీసుకురానున్నారు.

ఇక ఈసినిమా ను పూర్తి చేసి నాని ది ప్యారడైజ్ ను స్టార్ట్ చేయనున్నాడు.కుదిరితే ఈఏడాదే ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.అటు నాని నిర్మాణంలో రూపొందుతున్న కోర్ట్ అనే సినిమా మార్చి 14న విడుదలకానుంది.అలాగే మెగాస్టార్ చిరంజీవి ,శ్రీకాంత్ ఓదెల సినిమాకు కూడా నాని ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.