పుష్ప 2 తరువాత బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది ఛావా .రెండో వారం లోకి ఎంట్రీ ఇచ్చిన ఈసినిమా సెన్సేషనల్ హోల్డ్ తో డామినేషన్ కొనసాగిస్తుంది.రెండో శనివారం రికార్డు స్థాయిలో 44 .10కోట్ల నెట్ ను రాబట్టగా నిన్న 41.10కోట్ల వసూళ్లను ఖాతాలో వేసుకుంది.భారత్ -పాక్ మ్యాచ్ ప్రభావాన్ని తట్టుకొని మరీ రాంపేజ్ కొనసాగించింది.రెండో వారాంతంలో (శుక్ర -ఆదివారం) 109.23 కోట్ల వసూళ్ళను రాబట్టింది.హిందీ సినిమా చరిత్రలో పుష్ప 2 తరువాత ఈ ఘనత సాధించిన రెండో సినిమాగా రికార్డు సృష్టించింది.ఇంతకుముందు పుష్ప 2 రెండో వారాంతంలో 128కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఓవరాల్ గా ఛావా 10రోజుల్లో దేశవ్యాప్తంగా 334.41కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రెండ్ చూస్తుంటే ఈ వారంలో 400కోట్ల క్లబ్ లో చేరేలానే వుంది.ఇక ప్రపంచ వ్యాప్తంగా ఛావా 10రోజుల్లో 400 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకుంది.ఫుల్ రన్ లో మరో 200 కోట్ల వరకు రాబట్టుకునే ఛాన్స్ వుంది.కేవలం హిందీ భాషలోనే వచ్చిన ఈసినిమా ఊహించని రన్ ను కొనసాగిస్తోంది.ఇప్పట్లో పెద్ద సినిమాల విడుదల కూడా లేకేపోవడం అడ్వాంటేజ్ కానుంది.
మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ బయోపిక్ గా వచ్చిన ఈసినిమాలో విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్ గా నటించగా అతనికి జోడిగా రష్మిక మందన్న నటించింది.లక్ష్మణ్ ఉఠేకర్ ఈసినిమాను తెరకెక్కించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.దినేష్ విజన్ ఈసినిమాను నిర్మించాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























