విక్కీ కౌశల్ చావా బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. మొదటి వారంలో సెన్సేషనల్ రన్ తో 200కోట్ల నెట్ క్లబ్ లోకి రాగ రెండో వారంలోనూ అదే జోరు కొనసాగిస్తోంది.నిన్న ఈసినిమా దేశ వ్యాప్తంగా 24.03 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకొని 8రోజుల్లో మొత్తం 249. 31కోట్ల నెట్ ను సొంతం చేసుకుంది. ఇక ఈరోజు ర్యాంపేజ్ కొనసాగిస్తోంది. బుక్ మై షో లో గంటకు 50వేల టికెట్ బుకింగ్స్ తో ట్రెండ్ అవుతుంది. ఈరోజు 30 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకోనుంది. నిన్నటి వరకు ఈసినిమాకు బుక్ మై షో లో 6 మిలియన్ల కుపైగా టికెట్స్ సేల్స్ జరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రెండ్ చూస్తుంటే రేపటి తో చావా 300 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యేలానే వుంది.ప్రస్తుతం వేరే సినిమాలనుండి పోటీ లేకపోవడం కూడా అడ్వాంటేజ్ కానుంది.చావా కేవలం హిందీ లో మాత్రమే రిలీజై వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఫుల్ రన్ లో ఈసినిమా 500 కోట్ల క్లబ్ లో చేరాలనే వుంది. విక్కీ కౌశల్ కెరీర్ లోనే ఈసినిమా బిగెస్ట్ హిట్ గా నిలువనుంది.
మహారాష్ట్ర యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ బయోపిక్ గా వచ్చిన ఈసినిమాలో శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ నటించగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.లక్ష్మణ్ ఉఠేకర్ డైరెక్ట్ చేయగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.యష్ రాజ్ ఫిలిమ్స్ ,పెన్ స్టూడియోస్ ఈసినిమాను నిర్మించాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: