యంగ్ హీరో సందీప్ కిషన్ ,ధమాకా ఫేమ్ త్రినాధరావు నక్కిన కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా మజాకా.అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్ గా ఈ శివరాత్రికి విడుదలకానుంది.అయితే సినిమా మీద వున్న నమ్మకం తో ఒక రోజు ముందుగానే అంటే రేపు సాయంత్రం నుండి సెలెక్టడ్ థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్లు వేయనున్నారు.ఇందులో కనుక పాజిటివ్ టాక్ వస్తే సినిమా ఓపెనింగ్స్ కు అడ్వాంటేజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నిన్న విడుదల చేసిన ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గా అనిపించింది.ఈసినిమాలో హీరో తండ్రిగా రావు రమేష్ కనిపించనున్నాడు.కొడుకు తోపాటు తండ్రి కూడా లవ్ స్టోరీ పెట్టారు.అందులో నుండి వచ్చే ఫన్ సినిమా కు కీలకం కానుంది.క్లిక్ అయితే సినిమా అనుకున్న విజయం సాధించడం ఖాయం.
మజాకా లో సందీప్ కిషన్ కు జోడిగా రీతూ వర్మ నటించగా మన్మథుడు ఫేమ్ అన్షు కీలక పాత్రలో కనిపించనుంది.లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు.ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్,హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మించగా 2గంటల 29నిమిషాల రన్ టైం తో థియేటర్లలోకి రానుంది.
ఇక వరస పరాజయాల తరువాత సోలో హీరోగా రెండేళ్ల క్రితం ఊరు పేరు భైరవ కోనతో హిట్ కొట్టాడు సందీప్ కిషన్.మరి ఈమజాకాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: