తెలుగు సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ మాస్టర్

Kodi Ramakrishna: A Visionary Filmmaker Who Redefined Telugu Cinema With VFX,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Remembering Kodi Ramakrishna,Kodi Ramakrishna,Kodi Ramakrishna Movies,Kodi Ramakrishna Best Movies,Kodi Ramakrishna Horror Movies,Director Kodi Ramakrishna,Director Kodi Ramakrishna Memorable Hits,Kodi Ramakrishna Movie Career,Kodi Ramakrishna Film Career,Director Kodi Ramakrishna Life Story,Ankusam,Ammoru,Arundhati,Director Kodi Ramakrishna Hits,Kodi Ramakrishna Top Movies,Kodi Ramakrishna Films,Anji,Devullu,Arundhati Movie,Intlo Ramayya Veedhilo Krishnayya,Director Kodi Ramakrishna Tollywood Journey,Kodi Ramakrishna Movie Journey

తెలుగు సినిమా చరిత్రలో అనేక మంది దర్శకులు, నిర్మాతలు, కళాకారులు తమ అద్వితీయ కృషితో సినిమా ప్రపంచాన్ని మార్చి, వినోదం, సందేశాలను ప్రేక్షకులకు అందించారు. అటువంటి మహనీయులలో కోడి రామకృష్ణ గారు ఒకరు. ఆయన తెలుగు సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ అనే కొత్త డైమెన్షన్ ను తీసుకువచ్చి, సినిమా ప్రపంచాన్ని ఎప్పటికీ మార్చివేసిన దర్శకుడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈరోజు తెలుగు సినిమా స్థాయి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది అంటే అది ఆరోజు అయన వేసిన పునాదే.. అలాంటి ఆహానియుడి గురించి ఒక్క సారి అయన 6 వర్ధంతి సందర్భంగా గుర్తుచేసుకుందాం. కోడి రామకృష్ణ గారు 1949 జూలై 23న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. ఆయన తన కెరీర్ ను ఒక అసోసియేట్ డైరెక్టర్ గా ప్రారంభించారు.

కానీ కొంత కాలానికే దర్శకత్వం వైపు మళ్లించుకున్నారు. ఆయనకు సినిమాటిక్ టెక్నిక్స్ & స్టోరీ టెల్లింగ్ పై గాఢమైన అవగాహన, ప్యాషన్ ఉండేది. అదే ఆయనను తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా మార్చింది. కోడి రామకృష్ణ గారి అత్యంత ముఖ్యమైన కృషి అనేది తెలుగు సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ ను పరిచయం చేయడం.

ఆ కాలంలో భారతీయ సినిమా ప్రపంచంలోనే విజువల్ ఎఫెక్ట్స్ అనేది చాలా కొత్త, పెద్దగా ఎవరు కూడా అన్వేషించబడని రంగం. కానీ కోడి రామకృష్ణ గారు ఈ టెక్నాలజీని తెలుగు సినిమాకు తీసుకువచ్చి, దానిని ఒక కళారూపంగా మార్చారు. ఈరోజు ఎఫెక్ట్స్ 25th క్రాఫ్ట్ గా మారింది. విజువల్ ఎఫెక్ట్స్ ను ఉపయోగించి, ఆయన చేసిన ఫాంటసీ ఫిలిమ్స్ కళాఖండాలుగా నిలిచిపోయాయి.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు అమ్మోరు, దేవి, దేవ్వుళ్ళు, అంజి, అరుంధతి ఇలా ఒక్కో సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేసాయి. ఈ సినిమాలు తెలుగు సినిమా స్థాయిని పెంచాయి. ఆ సినిమాల ద్వారా ప్రేక్షకులకి కూడా సినిమాని చూసే దృష్టే మార్చేసిన విజనరీ కోడి రామకృష్ణ గారు. మరి అంతటి మహానుభావుడిని స్మరించుకోవడం మన కర్తవ్యం.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.