బాలకృష్ణ డాకు మహారాజ్ సంక్రాంతి టైంలో వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.ఈసినిమాతో బాలకృష్ణ మొదటి సారి 150కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈసినిమా ను రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురాగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది.కేవలం తెలుగు మాత్రమే కాదు మలయాళ ప్రేక్షకులు కూడా ఈసినిమాకు ఫిదా అవుతున్నారు. బాబీ టేకింగ్ , బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ ,తమన్ బీజీఎమ్ హైలైట్ అంటూ సోషల్ మీడియా లో ప్రశంసలు కురిపిస్తున్నారు. వ్యూస్ పరంగాను ఈసినిమాను బెస్ట్ వ్యూయర్ షిప్ ను సొంతం చేసుకుంటూ నెట్ ఫ్లిక్స్ లో మొదటి స్థానం లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో శ్రద్దా శ్రీనాథ్ ,ప్రగ్యా జైస్వాల్ ,ఊర్వశి రౌతేలా కీలక పాత్రల్లో నటించగా బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించాడు.సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించాయి.ఈసినిమాతో బాలకృష్ణ వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
ఇక బాలకృష్ణ ఈ ఏడాది మరో సారి ప్రేక్షకులను పలకరించనున్నాడు.అందులో భాగంగా ప్రస్తుతం ఆయన అఖండ సీక్వెల్ అఖండ 2 లో నటిస్తున్నాడు. బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ ఈసినిమాను నిర్మిస్తుంది. దసరాకు విడుదలకానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: