నేచురల్ స్టార్ నాని నిర్మాణ సారథ్యంలోని వాల్ పోస్టర్ సినిమా సమర్పిస్తున్న తాజా చిత్రం ‘కోర్ట్’ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. యువ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న నటిస్తున్న ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌కి మూవీ ప్రెజంటర్ నేచరల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. తెలుగు సినిమాకి స్వర్ణయుగం నడుస్తోంది. ఇలాంటి సమయంలో నాని అన్న అద్భుతమైన కథలతో సినిమాలు తీస్తున్నారు. నాని అన్నతో నటిస్తూ, స్ఫూర్తి పొందుతూ, అన్న బ్యానర్ లో సినిమా చేయడం లక్కీగా భావిస్తున్నాను.” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “తెలుగు సినిమా గారాల చిన్నకొడుకు నాని అన్న. ఒక్క సిట్టింగ్ లో కథని ఓకే చేశారు. ఇప్పటి వరకూ సినిమాకి ఇచ్చిన రెస్పాన్స్ కి థాంక్ యూ. మీ నుంచి మరింత ప్రేమ కావాలి. ఇలాంటి సినిమాని సపోర్ట్ చేయాలని కొరుకుంటున్నాను” అని తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: