మహాకుంభమేళా వేదికగా లాంచ్ కానున్న ఓదెల 2 టీజర్

Odela 2 Teaser Will be Launched at Maha Khumb Mela Soon

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధానపాత్రలో నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’. ఇది 2021లో హిట్ అయిన ‘ఓదెల రైల్వే స్టేషన్‌’కి సీక్వెల్‌గా వస్తోంది. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్స్ పై నిర్మాత డి మధు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నాగ సాధు పాత్రలో తమన్నా పెరోషియస్, స్టన్నింగ్ పోస్టర్స్ క్యురియాసిటీని పెంచాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓదెల 2 మేకర్స్ ఎక్సయిటింగ్ అప్డేట్ తో వచ్చారు. ఈ సినిమా టీజర్ ఫిబ్రవరి 22న కాశీ మహా కుంభమేళాలో లాంచ్ చేయనున్నారు. కాశీ మహా కుంభమేళాలో లాంచ్ కానున్న మొట్టమొదటి టీజర్ ‘ఓదెల 2’ కావడం విశేషం.

ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కుంభమేళా బ్యాక్ డ్రాప్ లో నాగసాధు గా కనిపించిన తమన్నా లుక్ డివైన్ వైబ్ తో పవర్ ఫుల్ గా వుంది. ఇక ఈ చిత్రం కోసం ప్రేక్షకులను అలరించే బ్రెత్ టేకింగ్ స్టంట్స్ ని పెర్ఫామ్ చేయడానికి తమన్నా భాటియా ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు.

ఓదెల2 భారీ బడ్జెట్‌, హై క్యాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని ఇవ్వబోతోంది. ఎంగేజింగ్ కథనాలతో థ్రిల్లింగ్ యాక్షన్‌ను బ్లెండ్ చేయడంలో పాపులరైన సంపత్ నంది ఈ చిత్రాన్ని సూపర్ విజన్ చేస్తున్నారు. ఒదెల 2కి కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ప్రముఖ డీవోపీ సౌందర్‌రాజన్ ఎస్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు. ఆర్ట్ డైరెక్షన్‌ రాజీవ్ నాయర్. డైనమిక్ టెక్నికల్ టీమ్‌తో ఓదెల 2 ఒక మరపురాని సినీ ప్రయాణంగా రూపొందుతోంది. కాగా ఈ చిత్రంలో తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి వంటి ప్రముఖ తారాగణం నటిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.