‘వైశాలి’తో సూపర్‌హిట్‌ని అందించిన హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌లు రెండోసారి మరో ఇంట్రస్టింగ్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’ కోసం చేతులు కలిపారు. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్స్లీ, ఎం.ఎస్. భాస్కర్, రాజీవ్ మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ రోజు మేకర్స్ ‘శబ్దం’ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ‘వెయ్యి గబ్బిలాలు చెవిలో అరుస్తున్నట్లు వుంటుంది డాక్టర్’ అనే వాయిస్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ఎలిమెంట్స్ తో కట్టిపడేసింది. ట్రైలర్ ఆడియో హాలోజినేషన్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని ఇచ్చింది. మేకర్స్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ని చాలా డిఫరెంట్ ప్రజెంట్ చేశారు.
ట్రైలర్ అయితే సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చింది. ఆది పినిశెట్టి పారానార్మల్ ఇన్వెస్టి గేటర్ క్యారెక్టర్ లో తన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. లక్ష్మీ మీనన్ క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. అరుణ్ బత్మనాభన్ అందించిన విజువల్స్ సినిమాలో లీనమయ్యేలా చేశాయి. ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సస్పెన్స్ ని మరింతగా పెంచుతుంది.
జాతీయ అవార్డు గ్రహీత సాబు జోసెఫ్ ఎడిటింగ్ షార్ఫ్ గా వుంది. 7G ఫిల్మ్స్ శివ నిర్మిస్తున్న శబ్దం ఫిబ్రవరి 28న ఆంధ్రాలో ఎన్ సినిమాస్, నైజాంలో మైత్రి డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల కానుంది. మనోజ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ మూవీ టెర్రిఫిక్ ప్రిమైజ్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్, హంటింగ్ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: