టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటిస్తోన్న లేటెస్ట్ మల్టీ స్టారర్ ‘భైరవం’. వీరి సరసన అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కథానాయికలుగా కనిపించనున్నారు.ఈ మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్‌కి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన లీడ్ యాక్టర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఫస్ట్ సింగిల్ ఓ వెన్నెల సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. అలాగే రీసెంట్ గా విడుదల చేసిన మూవీ టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది.
ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ భైరవం’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ పంచుకున్నారు మేకర్స్. రేపు ఈ సినిమా నుండి పవర్‌ఫుల్ థీమ్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్టు తెలిపింది చిత్ర బృందం. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన స్పెషల్ వీడియోలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంటెన్స్ అండ్ ఫెరోషియస్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు.
నియో-నోయిర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో ప్రముఖ తారాగణం సందడి చేస్తుండగా.. పేరొందిన సాంకేతిక సిబ్బంది పనిచేస్తున్నారు. హరి కె వేదాంతం సినిమాటోగ్రఫీ, శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తుండగా.. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: