కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ డైరెక్షన్ వహిస్తున్న తాజా చిత్రం ‘జాబిలమ్మ నీకు అంతా కోపమా’. యువ నటీనటులతో రూపొందుతోన్న ఈ సినిమా తమిళంలో ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’ (నీక్) అనే పేరుతో తెరకెక్కుతోంది. ఇందులో పవిష్, వెంకటేష్ మీనన్, సిద్దార్థ శంకర్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, రమ్య రంగనాథ్ తదితరులు లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవలే ఈ సినిమా నుండి ‘గోల్డెన్ స్పారో’ అనే సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ రొమాంటిక్ సాంగ్ తమిళ్ వెర్షన్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. 130 మిలియన్లకి పైగా వ్యూస్‌తో చార్ట్ బస్టర్ అనిపించుకుంది. ఈ క్రమంలో ఈ పాట తెలుగు వెర్షన్ కూడా మ్యూజిక్ లవర్స్‌ను బాగానే ఇంప్రెస్ చేసింది. అలాగే ఇటీవలే విడుదలచేసిన ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి మరో లిరికల్ వీడియోను రిలీజ్ చేసారు మేకర్స్. ‘ప్రేమ ఫెయిలై పోయేరా’ అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. రాంబాబు గోసాల సాహిత్యం అందించిన ఈ పాటను గాయకుడు కృష్ణ తేజస్వి అద్భుతంగా ఆలపించారు. మొత్తానికి ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేదిగావుంది.
ఇప్పటివరకూ వచ్చిన రెండు పాటలూ మంచి ట్యూన్స్‌తో అలరించాయి. దీంతో ధనుష్ తొలిసారి యంగ్‌స్టర్స్‌తో తీస్తున్న ఈ చిత్రంలో సాంగ్స్‌కి మంచి ప్రాముఖ్యతే ఉండనుందని తెలుస్తోంది. జి.వి.ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్న జాబిలమ్మ నీకు అంతా కోపమా చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ తెలుగులో విడుదలచేస్తోంది. ఫిబ్రవరి 21న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: