ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహాకుంభమేళాకు హాజరయ్యారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. సతీమణి అన్నా అన్నాలెజినోవా, కుమారుడు అకీరాతో కలిసి పవన్ కళ్యాణ్ పుణ్య స్నానం ఆచరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా పవిత్ర సంగమం వద్ద పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి గంగా హారతి ఇచ్చారు. కాగా వీరివెంట పవన్ కళ్యాణ్ సన్నిహితుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఇక ఇందుకు సంబంధించిన చిత్రాలను పవన్ కళ్యాణ్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అయితే అంతకుముందు పవన్ కళ్యాణ్ దక్షిణాదిన ప్రసిద్ధి చెందిన ఆలయాల సందర్శనను పూర్తిచేసుకున్నారు. దీనిలో భాగంగా గత వారం తన కుమారుడు అకీరా నందన్ తో కలిసి కేరళ, తమిళనాడులోని ప్రసిద్ధ ఆలయాలను సందర్శించారు. సనాతన ధర్మ పరిరక్షణ కొరకు పాటుపడతానని గతేడాది ప్రకటించి దీక్ష తీసుకున్న పవన్ కళ్యాణ్.. తాజాగా మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించడం విశేషం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























