యంగ్ హీరో సందీప్ కిషన్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా మజాకా.ధమాకా ఫేమ్ త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది సందీప్ కిషన్ కి 30వ సినిమా.ఫన్ &ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్,హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.రీసెంట్ గా ఈసినిమాను వచ్చిన టీజర్, సాంగ్స్ సూపర్ రెప్స్పాన్స్ తెచ్చుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా సెన్సార్ కూడా జరిగిపోయింది.యు/ఏ సర్టిఫికెట్ ను జారీ చేయగా 2గంటల 29నిమిషాల రన్ టైంతో థియేటర్లలోకి రానుంది.ఇందులో రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా రావు రమేష్ ,అన్షు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.లియోన్ జేమ్స్ సంగీతం సమకూరుస్తున్నాడు.ఈనెల 26న మజాకా థియేటర్లలోకి రానుంది.
ఇక ఈ రోజు మేకర్స్ ఈ సినిమా నుంచి పగిలి సాంగ్ ని రిలీజ్ చేశారు. లియోన్ జేమ్స్ ఈ పాటని మాస్ డ్యాన్స్ నెంబర్ గా కంపోజ్ చేశారు.మహాలింగం, సాహితీ చాగంటి, ప్రభ పవర్ ఫుల్ వోకల్స్ పాడిన ఈ సాంగ్ కు కాసర్ల శ్యామ్, ప్రసన్న కుమార్ బెజవాడ అందించిన లిరిక్స్ మాస్ ని మరింత ఎలివేట్ చేశాయి.
ఈ సాంగ్ లో సందీప్ కిషన్ ఎనర్జిటిక్ మాస్ డ్యాన్స్ మూమెంట్స్ అదిరిపొయాయి.సందీప్ కిషన్, రీతు వర్మ కెమిస్ట్రీ అద్భుతంగా వుంది. మ్యాసీవ్ అండ్ వైబ్రెంట్ సెట్స్ లో చిత్రీకరించిన ఈ సాంగ్ లో విజువల్స్ కలర్ ఫుల్ గా వున్నాయి.శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ గ్రేస్ ఫుల్ గా వుంది.ఈపాట థియేటర్స్ లో మాస్ ని మెస్మరైజ్ చేయడం ఖాయం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: