ఈ నెలలో మొదటి బ్లాక్ బస్టర్ గా నిలిచింది నాగ చైతన్య తండేల్.మొదటి వారం లో రిలీజ్ అయ్యి 100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకుంది.అయితే రెండో వారం లో చెప్పుకోదగ్గ విజయాలు ఏవి లేవు. ఇక మూడో వారంలో ఏకంగా నాలుగు సినిమాలు వస్తున్నాయి.మరి ఈశుక్రవారం వస్తున్న ఆ సినిమాలేంటో ఓసారి చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కమెడియన్ ధనరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా రామం రాఘవం ఈ శుక్రవారం విడుదలవుతుంది.ధనరాజ్ ,సముద్రఖని లీడ్ రోల్స్ లో నటించారు.తండ్రి అంటే పడని కొడుకు కథతో తెరకెక్కింది ఈసినిమా.బలగంతో తన తోటి కమెడియన్ వేణు ఎల్దండి బ్లాక్ బస్టర్ కొట్టాడు.ఇప్పుడు ధనరాజ్ ప్రూవ్ చేసుకోవాల్సివుంది.
ఇక బాపు అనే సినిమా కూడా ఈవారం బరిలో నిలిచింది.తెలంగాణ రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది.ప్రముఖ నటుడు బ్రహ్మజీ ,సుధాకర్ రెడ్డి, ఆమనీ ,ధన్య బాలకృష్ణ కీలక పాత్రల్లో నటించారు.ట్రైలర్ అయితే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.బలగం లాంటి స్టోరీ తో వస్తుంది.
ఈసినిమాలతో పాటు ఈవారం రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి.అందులో ఒకటి నీక్. తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా అనే టైటిల్ తో వస్తుంది. ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించింది.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తుంది.స్టార్ హీరో ధనుష్ ఈసినిమాను డైరెక్ట్ చేసి నిర్మించాడు.ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఈసినిమాను ఇక్కడ విడుదలచేస్తుంది.
ఇక ఇంకోటి డ్రాగన్.ఈసినిమా తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా వస్తుంది.ఈసినిమా ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా వుంది.ఇది కూడా యూత్ ను టార్గెట్ చేసుకొని తెరకెక్కింది.లవ్ టుడే తో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ,డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ ఇందులో హీరోగా నటించగా అనుపమ ఓ హీరోయిన్ గా చేసింది.ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: